ఏపీ గర్వపడేలా చేశారు... ఖేలో ఇండియా విజేతలకు సీఎం జగన్ అభినందనలు
- హర్యానాలో ఖేలో ఇండియా పోటీలు
- 400మీ పరుగులో రజితకు స్వర్ణం
- శిరీషకు కాంస్యం
- వెయిట్ లిఫ్టింగ్ లో పసిడి సాధించిన పల్లవి
హర్యానాలోని పంచకులలో జరుగుతున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో ఏపీ అథ్లెట్ల ప్రదర్శనపై సీఎం జగన్ సంతోషం వ్యక్తం చేశారు. ఖేలో ఇండియా-2022 క్రీడల్లో రాష్ట్రానికి చెందిన కుంజా రజిత 400మీ పరుగులో స్వర్ణం సాధించింది. ఇదే ఈవెంట్ లో మరో ఏపీ అథ్లెట్ పల్లవి మూడోస్థానంతో కాంస్యం అందుకుంది. ఇక, శిరీష వెయిట్ లిఫ్టింగ్ క్రీడాంశంలో 64 కేజీల విభాగంలో పసిడి పతకం కైవసం చేసుకుంది. కాగా, వీరు ముగ్గురు పేద కుటుంబాల నుంచి వచ్చినవారు. రజితకు తండ్రి లేరు, శిరీష పరిస్థితి కూడా అదే.
ఖేలో ఇండియాలో ఈ త్రయం పతకాలు సాధించడంపై సీఎం జగన్ స్పందిస్తూ... ఖేలో ఇండియా క్రీడల్లో కళ్లు చెదిరే ప్రదర్శన కనబర్చిన చాంపియన్లకు శుభాభినందనలు అంటూ ట్వీట్ చేశారు. ఉక్కు సంకల్పానికి ప్రతీకల్లాంటి ఈ అమ్మాయిలు ఏపీని గర్వించేలా చేశారని కొనియాడారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా విజయం సాధించాలన్న వారి పోరాట స్ఫూర్తి ఎంతోమంది తమ కలలు నెరవేర్చుకునేందుకు ఉత్తేజం కలిగిస్తుందని పేర్కొన్నారు.