విధి నిర్వహణలో ఉన్న ఎస్సైని నెట్టారంటూ సోము వీర్రాజుపై కేసు నమోదు
- అమలాపురం వెళ్లేందుకు సోము వీర్రాజు ప్రయత్నం
- జొన్నాడ వద్ద అడ్డుకున్న పోలీసులు
- ఇరువర్గాల మధ్య వాగ్వాదం
- పోలీసు విధులకు ఆటంకం కలిగించారని అభియోగం
- 353, 506 సెక్షన్ల కింద కేసు నమోదు
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై పోలీసు కేసు నమోదైంది. ఇటీవల అమలాపురంలో అల్లర్లు జరగ్గా, సోము వీర్రాజు పరామర్శించేందుకు బయల్దేరారు. ఈ క్రమంలో సోము వీర్రాజును పోలీసులు జొన్నాడ వద్ద అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అమలాపురంలో సెక్షన్ 144, పోలీస్ యాక్ట్-30 అమల్లో ఉన్నందున నిలిపివేశామని సోము వీర్రాజుకు పోలీసులు స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో, పోలీసు విధులకు ఆటంకం కలిగించారని, విధి నిర్వహణలో ఉన్న ఎస్సైని నెట్టివేశారని సోము వీర్రాజుపై అభియోగాలు మోపారు. ఈ మేరకు కోనసీమ జిల్లా ఆలమూరు పోలీస్ స్టేషన్ లో సెక్షన్ 353, సెక్షన్ 506 కింద కేసు నమోదు చేశారు.
అయితే, సోము వీర్రాజుతో పోలీసుల వాగ్వాదం ఓ ప్రణాళిక ప్రకారం జరిగిందని ఏపీ బీజేపీ ఆరోపించింది. జొన్నాడ జంక్షన్ లో పోలీసులు సోము వీర్రాజుతో వాగ్వాదానికి దిగగా, మరో పోలీసు దాన్ని వీడియోలో చిత్రీకరించడమే అందుకు నిదర్శనమని పేర్కొంది. ఈ మేరకు ఓ పోలీసు వీడియో తీస్తున్న ఫొటోను కూడా ఏపీ బీజేపీ పంచుకుంది.
.