ద్రవ్యోల్బణంపై ఆర్బీఐ అంచనాల ప్రభావం... నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • 214 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 60 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
  • 3.31 శాతం నష్టపోయిన భారతీ ఎయిర్ టెల్ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. వరసగా నాలుగో రోజు నష్టాలను మూటకట్టుకున్నాయి. రెపోరేటు పెంచుతున్నట్టు ఆర్బీఐ ప్రకటించిన వెంటనే మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆర్బీఐ అంచనాలతో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 214 పాయింట్లు కోల్పోయి 54,892కి పడిపోయింది. నిఫ్టీ 60 పాయింట్లు నష్టపోయి 16,356 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (1.70%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.66%), డాక్టర్ రెడ్డీస్ (1.52%), బజాజ్ ఫైనాన్స్ (1.25%), టీసీఎస్ (1.22%). 

టాప్ లూజర్స్:
భారతీ ఎయిర్ టెల్ (-3.31%), ఐటీసీ (-2.03%), రిలయన్స్ (-1.74%), ఏసియన్ పెయింట్స్ (-1.44%), యాక్సిస్ బ్యాంక్ (-1.03%).


More Telugu News