ట్రిపుల్ రైడింగ్ వద్దన్న పోలీస్‌పై యువకుడు, ఇద్దరు యువతుల దాడి.. వీడియో ఇదిగో
- దేశ రాజధానిలో ఘటన
- ట్రిపుల్ రైడింగ్‌తో దూసుకువచ్చిన బైక్
- అది కూడా రాంగ్ రూట్‌లోనే రాక
- అడ్డుకున్న పోలీసుపై మూకుమ్మడి దాడి
- ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నా వినని యువకుడు, యువతులు
బుధవారం సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఓ వీడియో తెగ వైరల్‌గా మారిపోయింది. ఈ వీడియోలో ఓ యువకుడు, అతడి వెంట ఉన్న ఇద్దరు యువతులు... ముగ్గురూ కలిసి ఓ పోలీసు అధికారిని ఓ స్తంభానికి కట్టేసినట్లుగా నొక్కి పట్టి... ఆయన గల్లాను రెండు వైపులా పట్టుకుని కొడుతున్నారు. అప్పటికే అక్కడికి చేరిన ప్రజలు ఈ దృశ్యాన్ని అలా చూస్తూ నిలుచున్నారు.
ఇక ఘటన సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు కూడా అక్కడికి పరుగు పరుగున వచ్చారు. పోలీసు అధికారిని అక్కడి నుంచి పంపించేందుకు ట్రాఫిక్ పోలీసులు ఎంతగా యత్నించినా ఆ యువకుడు, యువతులు ససేమిరా అంటున్నారు. మధ్యలో ట్రాఫిక్ కానిస్టేబుళ్లు నిలుచున్నా కూడా అవకాశం చిక్కినప్పుడల్లా ఆ పోలీసు అధికారిపై వారు చేయి చేసుకుంటూనే ఉన్నారు
ఆ తర్వాత అతికష్టం మీద వారి బారి నుంచి పోలీసు అధికారిని తప్పించిన ట్రాఫిక్ పోలీసులు ఆయనను అక్కడి నుంచి పంపించి వేస్తుండగా... ఆ యువకుడు కాస్తంత తగ్గినట్లే తగ్గి మళ్లీ ఆయనపైకి దూసుకువచ్చాడు. అతడిని మరోమారు ఎలాగోలా నిలువరించినా.. అతడి వెన్నంటే వచ్చిన యువతులు మరోమారు పోలీసు అధికారిపై దాడికి దిగారు. ట్రాఫిక్ పోలీసుల వినతితో ఆ యువకుడు కాస్తంత తగ్గినా... ఇద్దరు యువతులు మాత్రం ట్రాఫిక్ పోలీసులను ఏమాత్రం ఖాతరు చేయలేదు. ఇదంతా ఎక్కడో మారుమూల ప్రాంతంలో చోటుచేసుకున్న ఘటన కాదు. దేశ రాజధాని ఢిల్లీలోనే జరిగిన ఘటన.
అయినా ఈ గోడవకు కారణమేమిటన్న విషయంలోకి వస్తే... ఓ బైక్‌పై ఆ యువకుడు, తనతో ఉన్న ఇద్దరు యువతులను ఎక్కించుకుని వస్తున్నాడట. అంటే... ట్రిపుల్ రైడింగ్ అన్న మాట. అంతేకాదండోయ్... ట్రిపుల్ రైడింగ్‌తో దూసుకువస్తున్న ఆ యువకుడు తన బైక్‌ను రాంగ్ రూట్లో పరుగులు పెట్టిస్తున్నాడట. దీంతో వారిని పోలీసు అధికారి అడ్డుకోగా... తమనే అడ్డుకంటావా? అంటూ ఆయనపై ఆ ముగ్గురు దాడికి దిగారు. ఈ దాడిలో పోలీసు అధికారికి రక్తం వచ్చేలా గాయాలయ్యాయి. అయితే ఆ పోలీసు అధికారి తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లుగా నిందితులు ఆరోపిస్తున్నారు.