వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- అజ్మీర్ దర్గా సూఫీపై వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు
- కేసు నమోదు చేసిన కంచన్ బాగ్ పోలీసులు
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ చిక్కుల్లోపడ్డారు. రాజస్థాన్ లోని అజ్మీర్ దర్గా సూఫీ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టీపై రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై హైదరాబాదులోని కంచన్ బాగ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
రాజా సింగ్ ఓ వీడియోలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ సూఫీ ప్రతినిధి బృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును స్వీకరించిన కంచన్ బాగ్ పోలీసులు వీడియో ఆధారంగా ఘోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పై సెక్షన్ 295ఏ కింద కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు ఆరంభించారు. ఇటీవల ఓ బహిరంగ సభలో రాజా సింగ్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.