టీమిండియా నుంచి పిలుపుతో సంబరపడిపోతున్న ఉమ్రాన్ మాలిక్
- దేశం తరఫున ఆడాలన్నది తన కల అన్న మాలిక్
- అది ఇప్పుడు నెరవేరబోతోందని సంతోషం
- తనలో ఆత్మవిశ్వాసం పెరిగినట్టు ప్రకటన
- దక్షిణాఫ్రికాతో రేపే మొదటి టీ20 మ్యాచ్
జమ్మూ కశ్మీర్ సూపర్ ఫాస్ట్ బౌలర్, సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెటర్ అయిన ఉమ్రాన్ మాలిక్ తనకు టీమిండియాలో చోటు దక్కడం పట్ల సంబరపడిపోతున్నాడు. ఈ నెల 9వ తేదీ నుంచి దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్ లు జరగనున్నాయి.
‘‘దేవుడికి ధన్యవాదాలు. దేశం తరఫున ఆడాలన్నది నా కల. టీమిండియా నుంచి నాకు కాల్ వచ్చింది’’ అని ఉమ్రాన్ మాలిక్ ప్రకటించాడు. మాలిక్ మాట్లాడిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ పై ఉంచింది.
'టీమిండియా జట్టులో చేరడంతో ఎంతో ఉద్వేగానికి లోనయ్యాను. ప్రతి ఒక్కరితో కలసి ప్రాక్టీస్ చేశాను. నేను చక్కగా బౌలింగ్ చేయగలనన్న నమ్మకం నాకుంది. జట్టు వాతావరణం ఆరోగ్యకరంగా ఉంది. ఐపీఎల్ లో కలసి మెలసి ఆడిన తర్వాత మేమంతా సోదరులుగా ఉన్నాం.
రాహుల్ సర్ (ద్రవిడ్) వంటి పెద్ద లెజెండరీ క్రికెటర్ ను కలుసుకోవడం ఆనందంగా ఉంది. నా వ్యూహాలకే కట్టుబడి ఉండాలని సలహా ఇచ్చారు. ఎలా బౌల్ చేయాలో పరాస్ సర్ కూడా వివరించారు. కోచ్ లు మనతో మాట్లాడేది మెరుగుపరిచేందుకే. ఇది నాలో ఎంతో విశ్వాసాన్ని నింపింది’’ అని మాలిక్ పేర్కొన్నాడు. తాను షమీ, బుమ్రా, భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ ను పరిశీలిస్తుంటానని చెప్పాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు.