ఏపీ టెన్త్ ఫలితాలపై ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పంద‌న ఇదే!

  • ప్ర‌భుత్వ వైఫ‌ల్యానికి విద్యార్థుల‌ను ఫెయిల్ చేశార‌న్న ప‌వ‌న్‌
  • 10 గ్రేస్ మార్కులు ఇవ్వాల‌ని డిమాండ్‌
  • రీ కౌంటింగ్‌ను ఉచితంగానే చేప‌ట్టాల‌ని విన‌తి
  • స‌ప్లిమెంట‌రీ పరీక్ష‌ల‌కు ఫీజు తీసుకోరాద‌న్న ప‌వ‌న్‌
ఏపీలో సోమ‌వారం విడుద‌లైన ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ బుధ‌వారం స్పందించారు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌కు విద్యార్థుల‌ను ఫెయిల్ చేశార‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు బుధ‌వారం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ ప్ర‌కట‌న విడుద‌ల చేశారు. విద్యార్థులు ఫెయిల్ కావ‌డానికి వారి ఇంటిలో త‌ల్లిదండ్రులే కార‌ణ‌మంటూ నెపం వేస్తారా? అని ప‌వ‌న్ మండిప‌డ్డారు. 

ఈ సంద‌ర్భంగా విద్యార్థుల ప‌క్షాన ప‌వ‌న్ ప‌లు డిమాండ్ల‌ను వినిపించారు. 10 గ్రేస్ మార్కులు ఇచ్చి విద్యార్థుల భ‌విష్య‌త్తును కాపాడాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఉచితంగా రీ కౌంటింగ్ నిర్వ‌హించాలని ఆయ‌న కోరారు. రీ కౌంటింగ్‌కు ఎలాంటి ఫీజు వ‌సూలు చేయరాద‌న్నారు. స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల‌కు ఫీజులు వ‌సూలు చేయ‌రాదని ప‌వ‌న్ డిమాండ్ చేశారు.


More Telugu News