నెప్ట్యూన్, యురేనస్ మధ్య రంగుల్లో వైవిధ్యం ఎందుకు?.. సమాధానం చెప్పిన నాసా!
- రెండు గ్రహాలపైనా ఒకే వాతావరణం
- ఒకే సైజుతో కూడుకున్నవే
- పొగ మంచు వల్లే రంగుల్లో వైవిధ్యమన్న నాసా
యురేనస్, నెప్ట్యూన్.. ఈ రెండు గ్రహాలు భూమికి సమీపంలో ఉంటాయి. అవి ఒకే రకమైన వాతావరణం, పరిమాణంతో ఉంటాయి. కానీ, టెలిస్కోపు నుంచి చూసినప్పుడు రంగుల పరంగా వీటి మధ్య వైవిధ్యం కనిపిస్తుంది. ఇలా ఎందుకన్న దానికి నాసా శాస్త్రవేత్తలు హబుల్ టెలిస్కోప్ సాయంతో సమాధానం కనుగొన్నారు.
నెప్ట్యూన్ కంటే యురేనస్ కొంచెం తేలికపాటి (లైటర్ టోన్) రంగులో కనిపిస్తుంటుంది. దీనికి సంబంధించి నాసా తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పరిశోధన వివరాలు వెల్లడించింది. ‘‘రెండు గ్రహాలపైనా గాఢమైన పొగ మంచు ఆవరించి ఉంది. కాకపోతే నెప్ట్యూన్ తో పోలిస్తే యురేనస్ పై ఈ పొర మందంగా ఉంది. ఈ పొగ మంచు పొర లేకపోతే రెండు గ్రహాలు అచ్చం ఒకే విధమైన బ్లూ రంగుతో కనిపిస్తాయి’’ అంటూ నాసా తన పోస్ట్ లో వివరించింది. ఇన్ స్టా గ్రామ్ లో నాసా పోస్ట్ కు యూజర్లు భారీగానే స్పందిస్తున్నారు.