మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలతో ఏకాకి అయిన నుపుర్ శర్మకు నెదర్లాండ్స్ ఎంపీ మద్దతు
- ఇస్లామిక్ దేశాలకు భయపడొద్దన్న నెదర్లాండ్స్ ఎంపీ
- స్వేచ్ఛ కోసం నిలబడండంటూ పిలుపు
- నుపుర్ శర్మకు మద్దతుగా నిలవండంటూ సూచన
మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, బీజేపీ అధికార ప్రతినిధి పదవి నుంచి, పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన నుపుర్ శర్మకు ఎట్టకేలకు మద్దతు దొరికింది. స్వదేశం నుంచి బహిరంగంగా ఆమెకు ఒక్కరూ బాసటగా నిలిచింది లేదు. పైగా ఆమెపై కేసులు పెట్టాలని, అరెస్ట్ చేయాలన్న డిమాండ్లు పెరిగిపోయాయి. చంపేస్తామంటూ బెదిరింపులు కూడా వస్తున్న తరుణంలో ఆమెకు కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పించాల్సి వచ్చింది.
ఇటువంటి పరిస్థితుల్లో నెదర్లాండ్స్ ఎంపీ గీర్ట్ వైల్డర్స్ స్పందిస్తూ.. నుపుర్ శర్మ మాట్లాడింది నిజమంటూ, దీనిపై ఇస్లామిక్ దేశాల స్పందన హాస్యాస్పదంగా ఉందన్నారు. నుపుర్ శర్మతోపాటు, బీజేపీ ఢిల్లీ మీడియా విభాగం ఇంచార్జ్ గా ఉన్న నవీన్ కుమార్ జిందాల్ సైతం ఈ విషయంలో పార్టీ చర్యకు బలవడం తెలిసిందే.
‘‘బుజ్జగింపులు పనిచేయవు. ఇవి పరిస్థితులను మరింత దారుణంగా మారుస్తాయి. భారత్ లోని నా ప్రియ స్నేహితులారా, ఇస్లామిక్ దేశాలకు భయపడొద్దు. స్వేచ్ఛ కోసం నిలబడండి. గర్వంగా భావించండి. మీ రాజకీయవేత్త నుపుర్ శర్మకు మద్దతుగా నిలవండి’’ అంటూ గీర్ట్ వైల్డర్స్ ట్వీట్ చేశారు.
ప్రవక్తపై వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేస్తున్న వారిని కపటవాదులుగా ఆయన అభివర్ణించారు. ఆయా ఇస్లామిక్ దేశాల్లో ప్రజాస్వామ్యం లేదని, చట్టం లేదని, స్వేచ్ఛ కూడా లేదని వ్యాఖ్యానించారు. ‘‘వారు మైనారిటీలను హింసించారు. మరెవరూ చేయని విధంగా మానవ హక్కులను హరించారు’’ అని వైల్డర్స్ నాణేనికి రెండో కోణాన్ని స్పృశించారు.
గ్రీన్ వైల్డర్స్ అతివాద నేతగా ప్రాచుర్యం పొందిన వ్యక్తి. పార్టీ ఫర్ ఫ్రీడమ్ వ్యవస్థాపకుడు. నెదర్లాండ్స్ లో ఇది మూడో అతిపెద్ద పార్టీగా ఉంది. ఇస్లాం విమర్శకుడిగా ఆయనకు పేరుంది.