ఆర్బీఐ పాలసీ ముఖ్యాంశాలు ఇవిగో..!

  • వృద్ధి రేటు 7.2 శాతంగా కొనసాగింపు
  • సర్దుబాటు విధానం ఉపసంహరణ
  • ద్రవ్యోల్బణం అంచనాలు 6.7 శాతానికి పెంపు
ఆర్బీఐ ఎంపీసీ ద్వైమాసిక సమీక్షా సమావేశం బుధవారం ఉదయం ముగిసింది. సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటించారు. 

  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 7.2 శాతంగానే ఆర్బీఐ కొనసాగించింది.
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనాలను పెంచింది. లోగడ 5.7 శాతంగా ఉంటుందన్న అంచనాలను 6.7 శాతానికి సవరించింది.
  • వ్యవస్థలో లిక్విడిటీ తగ్గింపు కొనసాగుతుందని ఆర్బీఐ తెలిపింది.
  • ఇంతకాలం వృద్ధికి మద్దతుగా సర్దుబాటు విధానాన్ని ఆర్బీఐ కొనసాగిస్తూ వచ్చింది. ఇటీవలే ‘సర్దుబాటు విధానం ఉపసంహరణ’కు మారింది. తాజా సమీక్షలోనూ దీన్నే కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. 
  • వృద్ధికి మద్దతుగా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి ప్రాధాన్యం కొనసాగుతుందని తెలిపింది.
  • ‘‘పెరిగిపోయిన అనిశ్చితుల్లో మేము డైనమిక్ గా, ఆచరణాత్మకంగా వ్యవహరిస్తామే కానీ, సంప్రదాయంగా, స్టీరియోటైప్ గా ఉండబోము. వృద్ధి, శ్రేయస్సు నిలిచి ఉండాలంటే అందుకు ధరలను కట్టడి చేయాలని అనుభవం చెబుతోంది. నేటి మా నిర్ణయాలు మధ్యకాలంలో ద్రవ్యోల్బణాన్ని స్థిరీకరిస్తాయి’’ అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ పేర్కొన్నారు. 
  • మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటును 5.15 శాతానికి, బ్యాంకు రేటును 4.65 శాతానికి పెంచింది.
  • తదుపరి ఆర్బీఐ ఎంపీసీ సమీక్ష ఆగస్ట్ 2-4 మధ్య ఉంటుంది.


More Telugu News