కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే చర్యలకు రాహుల్ రెడీ.. అక్టోబరు 2 నుంచి దేశవ్యాప్త పాదయాత్ర!
- కన్యాకుమారి నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్న రాహుల్ గాంధీ
- ప్రతి జిల్లాలో 75 కిలోమీటర్ల మేర సాగనున్న యాత్ర
- రోడ్ మ్యాప్ రెడీ చేస్తున్న టీఎన్‌సీసీ
కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టడంతోపాటు పార్టీలో తిరిగి జవసత్వాలు నింపాలని నిర్ణయించిన కాంగ్రెస్ పార్టీ అందుకు నడుంబిగించింది. ప్రజల్లోకి వెళ్లాలని, పాదయాత్ర చేయాలని రాజస్థాన్‌లో జరిగిన ఏఐసీసీ సమావేశంలో నిర్ణయించిన ఆ పార్టీ అందుకు సన్నద్ధమవుతోంది.
గాంధీ జయంతి రోజైన అక్టోబరు 2 నుంచి దేశవ్యాప్త పాదయాత్ర చేపట్టాలని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్ణయించినట్టు సమాచారం. ఆ రోజున తమిళనాడులోని కన్యాకుమారి నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (TNCC) వర్గాల ద్వారా తెలిసింది. ప్రతి జిల్లాలోనూ కనీసం 75 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగేలా రోడ్ మ్యాప్ తయారుచేస్తున్నట్టు సమాచారం.