జగన్ ప్రజలు అడిగినవీ, అడగనివీ కూడా నెరవేరుస్తున్నారు: వైసీపీ ఎమ్మెల్సీ రామచంద్రయ్య

  • కడపలో వైఎస్సార్ యంత్రసేవా పథకం ప్రారంభోత్సవం
  • ప్రజలు సైకిల్ అడిగితే ముఖ్యమంత్రి కారు కొనిస్తున్నారంటూ వ్యాఖ్య  
  • కేసీ కేనాల్ ఆయకట్టు ఎన్నడూ లేని విధంగా బీడుగా మారిందని ఆందోళన
  • నీళ్లున్నా పంటలు ఎందుకు పండించడం లేదని రైతులను ప్రశ్నించిన ఎమ్మెల్సీ
  • ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చి పెట్టాలని రైతులను కోరిన రామచంద్రయ్య
ప్రజలు సైకిల్ అడిగితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కారు కొనిస్తున్నారని, ఇలాగైతే రాష్ట్ర ప్రభుత్వానికి వనరులు ఎక్కడి నుంచి వస్తాయంటూ సొంత పార్టీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య అన్నారు. 'జగన్ ప్రజలు అడిగినవీ, అడగనివీ కూడా నెరవేరుస్తున్నారు' అంటూ ఆయన చెప్పుకొచ్చారు. కడప పురపాలక మైదానంలో నిన్న నిర్వహించిన వైఎస్సార్ యంత్రసేవా పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

గతంలో ఎన్నడూ చూడని విధంగా కేసీ కెనాల్ ఆయకట్టు బీడుగా మారిందని అన్నారు. కెనాల్‌లో నీళ్లున్నా రైతులు వరి పంట వేయకుండా పొలాలను బీళ్లుగా ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. చెన్నూరు చక్కెర కర్మాగారం తెరిస్తే వందలమంది రైతులు బాగుపడతారని, పరిశ్రమ పునరుద్ధరణ కోసం పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి ఆదాయ వనరులు సమకూర్చాలని రైతులను రామచంద్రయ్య కోరారు.


More Telugu News