తాజా ఆర్థిక సంవత్సరానికి భారత్ వృద్ధి రేటును సవరించిన ప్రపంచబ్యాంకు

తాజా ఆర్థిక సంవత్సరానికి భారత్ వృద్ధి రేటును సవరించిన ప్రపంచబ్యాంకు
  • తాజా నివేదిక విడుదల చేసిన ప్రపంచ బ్యాంకు
  • 2022-23 ఆర్థిక సంవత్సరంపై అంచనాలు
  • భారత్ జీడీపీ 7.5 శాతం ఉండొచ్చని వెల్లడి
  • ఇంతకుముందు 8 శాతం అని పేర్కొన్న ప్రపంచ బ్యాంకు
ప్రపంచ బ్యాంకు 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను భారత్ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) అంచనాలను సవరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ జీడీపీ 7.5 శాతం నమోదయ్యే అవకాశాలున్నాయని ప్రపంచ ఆర్థిక పరిణామాల తాజా నివేదికలో పేర్కొంది. ఇంతకుముందు భారత్ జీడీపీ 8 శాతం ఉండొచ్చని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. 

కాగా, తాజా ఆర్థిక సంవత్సరం (2022 ఏప్రిల్-2023 మార్చి)లో భారత్ పట్ల తన అంచనాలను సవరించడం ఇది రెండోసారి. గత ఏప్రిల్ లో భారత్ జీడీపీని 8.7 శాతం నుంచి 8 శాతానికి తగ్గించింది. ఇప్పుడా శాతాన్ని మరికాస్త తగ్గిస్తూ 7.5 గా పేర్కొంది. 2022 ప్రథమార్థంలో భారత ఆర్థిక కార్యకలాపాలను కొవిడ్ సంక్షోభం ప్రభావితం చేసిందని, ఆపై ఉక్రెయిన్ యుద్ధం ప్రతికూలంగా మారిందని ప్రపంచ బ్యాంకు తన నివేదికలో వివరించింది.


More Telugu News