కొత్తగా వచ్చే ప్రభుత్వ వైద్యులు ప్రైవేటుగా ప్రాక్టీస్ చేయడంపై నిషేధం... కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయం
- ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలు
- కొత్తగా వచ్చే వైద్యులకు నిబంధన
- సర్వీస్ రూల్స్ మార్పు
- తాజాగా ఉత్తర్వులు జారీ
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలోకి నేరుగా నియమితులయ్యే డాక్టర్లు ప్రైవేటుగా ప్రాక్టీస్ చేయడంపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే క్రమంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, బోధనా రంగంలో నాన్ టీచింగ్ నుంచి టీచింగ్ విభాగంలోకి బదిలీ అయ్యే వైద్య నిపుణులు కూడా ప్రైవేటు ప్రాక్టీసు చేయరాదని పేర్కొంది. ఈ మేరకు సర్వీస్ నిబంధనలను మార్పు చేసింది. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు నేడు వెలువడ్డాయి. అయితే, ఇప్పటికే ఉద్యోగాల్లో కొనసాగుతున్న వైద్యులకు ఈ నిబంధన వర్తించదని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.