జ‌గ‌న్ స‌ర్కారుకు ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ లేదు: జేపీ న‌డ్డా

  • రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో బీజేపీ గ‌ర్జ‌న స‌భ‌
  • ముఖ్య అతిథిగా హాజ‌రైన బీజేపీ చీఫ్ జేపీ న‌డ్డా
  • జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించిన వైనం
ఏపీలో గ‌డ‌చిన మూడేళ్లుగా పాల‌న సాగిస్తున్న వైసీపీ ప్ర‌భుత్వంపై బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జ‌గ‌త్ ప్ర‌కాశ్ న‌డ్డా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం ఏపీలో ప‌ర్య‌టిస్తున్న జేపీ న‌డ్డా... మంగ‌ళ‌వారం రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో 'బీజేపీ గ‌ర్జ‌న' స‌భ‌కు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. 

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ అన్న‌దే లేకుండాపోయింద‌ని విమర్శించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం విచ్చ‌ల‌విడిగా అప్పులు చేస్తోంద‌ని, ఇప్ప‌టికే రాష్ట్ర అప్పులు రూ.8 ల‌క్ష‌ల కోట్ల‌ను దాటిపోయాయ‌ని ఆయ‌న అన్నారు.  

కేంద్ర ప్ర‌భుత్వం అందిస్తున్న నిధుల‌తో పాటు కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల కోసం విడుద‌ల అవుతున్న నిధుల‌ను రాష్ట్రం దారి మ‌ళ్లిస్తోంద‌ని న‌డ్డా ఆరోపించారు. జ‌గ‌న్ పాల‌న‌లో అభివృద్ధి కుంటుప‌డిందని, రాష్ట్రానికి రావాల్సిన ప‌రిశ్ర‌మ‌లు వెన‌క్కు వెళ్లాయని ధ్వ‌జ‌మెత్తారు. జ‌గ‌న్ పాల‌న‌లో శాంతి భ‌ద్ర‌త‌లు క‌రవ‌య్యాయని ఆయ‌న ఆరోపించారు. ప్ర‌శ్నించే వారిపై కేసులు పెడుతున్నారని, పెట్టుబ‌డులు రాక రాష్ట్రంలో నిరుద్యోగం తాండ‌విస్తోందని నడ్డా విమర్శించారు. 


More Telugu News