పులివెందులలో సీబీఐ బృందం.. వివేకా హత్య కేసు నిందితుల ఇళ్ల పరిశీలన
- వివేకా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ బృందం
- నిందితుల ఇళ్ల ఫొటోలు, కొలతలు నమోదు చేసిన వైనం
- సాంకేతిక అంశాలు కేసు దర్యాప్తులో భాగమే
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారుల బృందం మంగళవారం పులివెందులను సందర్శించింది. పట్టణంలోని వివేకా హత్య కేసు నిందితుల ఇళ్లను స్వయంగా పరిశీలించింది. ఈ సందర్భంగా నిందితుల ఇళ్ల వద్ద పలు ఫొటోలు తీసుకున్న సీబీఐ అధికారులు... టేపు పట్టుకుని మరీ కొలతలు కూడా నమోదు చేసుకోవడం గమనార్హం.
వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఉమా శంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ కుమార్ యాదవ్, దస్తగిరిల ఇళ్లు పులివెందులలోనే ఉన్నాయి. వీరందరి ఇళ్లకు స్వయంగా వెళ్లిన సీబీఐ అధికారులు పలు అంశాలను నోట్ చేసుకున్నారు. సాంకేతిక అంశాల ఆధారంగా ఈ కేసు చిక్కుముడి విప్పాలన్న దిశగా సీబీఐ అధికారులు ఈ తరహా చర్యలు చేపట్టినట్టుగా సమాచారం.