హిజాబ్ ధరించి వచ్చిన 23 మంది విద్యార్థినులను సస్పెండ్ చేసిన మంగళూరు కాలేజీ
- దేశంలో ఇంకా కొనసాగుతున్న హిజాబ్ వివాదం
- కర్ణాటకలో తరచుగా ఘటనలు
- ఇప్పటికే పలుమార్లు హెచ్చరించిన మంగళూరు కాలేజీ
- హిజాబ్ ధరించి వచ్చి నిరసన వ్యక్తం చేసిన అమ్మాయిలు
దేశంలో హిజాబ్ వివాదానికి ఇప్పట్లో తెరపడేట్టు కనిపించడంలేదు. తాజాగా, మంగళూరులో ప్రభుత్వ కాలేజీ హిజాబ్ ధరించి వచ్చిన 23 మంది విద్యార్థినులను సస్పెండ్ చేసింది. గతంలో అనేక పర్యాయాలు హెచ్చరించినా, వారు హిజాబ్ ధరించి క్లాస్ రూముల్లో ప్రవేశించడంతో ఈ మేరకు చర్య తీసుకుంది.
దక్షిణ కన్నడ జిల్లా పుత్తూర్ తాలూకాలోని ఉప్పినంగడి గవర్నమెంట్ ఫస్ట్ గ్రేడ్ కాలేజీలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ 23 మంది అమ్మాయిలు హిజాబ్ లు ధరించి రావడమే కాకుండా, కాలేజీ యాజమాన్యం హెచ్చరికలను వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. క్లాసు రూముల్లోకి హిజాబ్ లు ధరించి రావడంతో వారిని శనివారం వరకు సస్పెండ్ చేసినట్టు పుత్తూర్ బీజేపీ ఎమ్మెల్యే, కాలేజీ డెవలప్ మెంట్ కమిటీ చైర్మన్ సంజీవ మతందూర్ వెల్లడించారు.
గతవారం కూడా ఇదే కాలేజీలో హిజాబ్ ధరించి వచ్చారన్న కారణంతో నలుగురు అమ్మాయిలను సస్పెండ్ చేశారు. కర్ణాటకలోని విద్యాసంస్థల్లో ఏ యూనిఫాం అమలు చేస్తే ఆ యూనిఫాంనే విద్యార్థులు ధరించాలంటూ రాష్ట్ర హైకోర్టు గతంలో స్పష్టం చేసింది. అయినప్పటికీ పలుచోట్ల అమ్మాయిలు హిజాబ్ లు ధరించి విద్యాసంస్థలకు వస్తున్న ఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి.