ఉక్రెయిన్ లో 100 రోజుల తర్వాత తెరుచుకున్న డ్రామా థియేటర్... ప్రతి షో హౌస్ ఫుల్
- గత మూడ్నెల్లకు పైగా కొనసాగుతున్న రష్యా దాడులు
- ఉక్రెయిన్ లో అస్తవ్యస్తంగా జనజీవనం
- కీవ్ లో కుదుటపడుతున్న పరిస్థితులు
- తెరుచుకుంటున్న సినిమా హాళ్లు, ఓపెరా హౌస్ లు
ఉక్రెయిన్ పై ఫిబ్రవరి 24 నుంచి రష్యా దండయాత్ర కొనసాగుతోంది. రష్యా దాడులకు 100 రోజులు పూర్తయినా, ఉక్రెయిన్ లొంగకపోగా, ప్రతిఘటన ముమ్మరం చేసింది. పలు ప్రాంతాలపై రష్యా పట్టు సాధించినా, అనేక ప్రాంతాల్లో ఇంకా ఉక్రెయిన్ దళాలు పోరాడుతున్నాయి. కాగా, ఉక్రెయిన్ భూభాగంపై ఓవైపు రష్యా దాడులు కొనసాగుతున్న తరుణంలో రాజధాని కీవ్ లో ఓ డ్రామా థియేటర్ తెరుచుకోవడం ఆశ్చర్యకర పరిణామం. థియేటర్ తెరుచుకోవడమే కాదు తొలిరోజు టికెట్లన్నీ అమ్ముడయ్యాయట.
యుద్ధ వాతావరణం నడుమ ప్రజలు థియేటర్ కు వస్తారో, రారో అని సందేహించిన నాటక బృందానికి టికెట్లు అమ్ముడైన తీరు కొత్త ఉత్సాహాన్ని కలిగించింది. మూడు షోలకు సంబంధించిన టికెట్లన్నీ అమ్ముడవడం తమకు సంతోషం కలిగించిందని ఫెలిఫెంకో అనే నటుడు వెల్లడించారు. అటు, కీవ్ లో పలు సినిమా థియేటర్లు, ఓపెరా హౌస్ లు కూడా తిరిగి తెరుచుకుంటున్నాయి.
ఉక్రెయిన్ లోని ఇతర భాగాలను చేజిక్కించుకునేందుకు రష్యా దళాలు కీవ్ నుంచి తరలి వెళ్లాయి. దాంతో కీవ్ లో ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడుతున్నాయి. యుద్ధం కారణంగా దేశంలోని పలు ప్రాంతాలకు వెళ్లిపోయిన కీవ్ వాసులు తిరిగి తమ స్వస్థలానికి చేరుకుంటున్నారు.