జనసేన తన పార్టీ అని పవన్ మరిచిపోయినట్టున్నారు: సజ్జల
- చంద్రబాబు వ్యూహాలనే పవన్ వల్లె వేస్తున్నారన్న సజ్జల
- రాజకీయంగా సీరియస్‌గా ఉన్నవారు ఒంటరి పోటీకే ఆసక్తి చూపిస్తారని కామెంట్
- పవన్ మాత్రం ఓ విశ్లేషకుడిలా పొత్తులపై ఆప్షన్లు చెప్పారన్న సజ్జల
2024 ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు, సోమవారం విజయవాడలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారం స్పందించారు. ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడిన సందర్భంగా సజ్జల ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.
రాజకీయంగా సీరియస్‌గా ఉన్న వాళ్లు ఒంటరిగానే పోటీ చేయాలని అనుకుంటారని సజ్జల అన్నారు. అయితే పవన్ కల్యాణ్ ఓ రాజకీయ నాయకుడిగా కాకుండా ఓ విశ్లేషకుడిగా పొత్తులపై ఆప్షన్లు ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. జనసేన తన పార్టీ అన్న విషయాన్ని పవన్ మరిచిపోయినట్టుగా ఉన్నారని కూడా సజ్జల ఆసక్తికర కామెంట్లు చేశారు. చంద్రబాబు వ్యూహాలనే పవన్ వల్లె వేస్తున్నట్లుగా అనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. పొత్తులపై పవన్ ఓ మాట, జనసేనతో పొత్తు కలిగిన బీజేపీ నేతలు మరో మాట మాట్లాడుతున్నారని సజ్జల అన్నారు.