బెంగాల్ విభజనను అడ్డుకునేందుకు రక్తాన్ని చిందించేందుకు సిద్ధంగా ఉన్నా: మమతా బెనర్జీ

  • బెంగాల్ లో ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లను బీజేపీ రెచ్చగొడుతోందన్న మమత 
  • దశాబ్దాలుగా బెంగాల్ ప్రజలు సామరస్యంతో జీవిస్తున్నారని వ్యాఖ్య 
  • జీవన్ సింగ్లా బెదిరింపులకు భయపడనన్న మమత  
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో పశ్చిమబెంగాల్ లో ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లను బీజేపీ లేవనెత్తుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. నార్త్ బెంగాల్, గూర్ఖాలాండ్ అంటూ బీజేపీ ప్రజలను రెచ్చగొడుతోందని అన్నారు. రాష్ట్ర విభజన ప్రయత్నాలను తాను అడ్డుకుంటానని... తన రక్తాన్ని సైతం చిందించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. దశాబ్దాలుగా బెంగాల్ ప్రజలంతా సామరస్యంతో జీవిస్తున్నారని... వీరి మధ్య విద్వేషాలను రగిల్చేందుకు బీజేపీ యత్నిస్తోందని అన్నారు.

మరోవైపు ప్రత్యేక కాంతాపూర్ ను వ్యతిరేకిస్తే మమతా బెనర్జీ రక్తాన్ని కళ్లచూస్తామని కాంతాపూర్ లిబరేషన్ సంస్థ నేత జీవన్ సింగ్లా హెచ్చరించారు. ఈ హెచ్చరికలపై మమతా బెనర్జీ స్పందిస్తూ... అలాంటి బెదిరింపులు తనను ఏమీ చేయలేవని అన్నారు. అలాంటి వాటిని లెక్క చేయనని, అలాంటి బెదిరింపులకు భయపడనని చెప్పారు.


More Telugu News