నర్సీపట్నం 'గడపగడపకు'లో రచ్చ... అమ్మ ఒడి రాలేదన్న జనంపై వైసీపీ ఎమ్మెల్యే ఆగ్రహం
- 'గడపగడపకు'లో పాల్గొన్న ఉమాశంకర్ గణేశ్
- అమ్మ ఒడి రావడం లేదని కొందరి ఫిర్యాదు
- మీరంతా టీడీపీ కార్యకర్తలే అంటూ ఆరోపించిన ఎమ్మెల్యే
- టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు పేరునూ ప్రస్తావించిన వైనం
ఏపీలో అధికార పార్టీ వైసీపీ చేపట్టిన 'గడపగడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో కొన్ని చోట్ల జనం నుంచి నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేశ్ పాలుపంచుకున్న గడపగడపకులో ఆయనను జనం నిలదీశారు. తమకు అమ్మ ఒడి రావడం లేదని పలువురు ఆయనకు విన్నవించగా... వారిపై ఆయన ఆగ్రహించిన వైనం వైరల్‌గా మారిపోయింది.
ఎమ్మెల్యే కార్యక్రమానికి భారీ సంఖ్యలో జనం వచ్చారు. ఈ సందర్భంగా తమకు అమ్మ ఒడి రావడం లేదని కొందరు ఎమ్మెల్యేకు చెప్పారు. ఆ మాట విన్నంతనే ఉమాశంకర్ గణేశ్ ఒక్కసారిగా ఆగ్రహోదగ్రుడయ్యారు. మీరంతా టీడీపీ కార్యకర్తలని, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అనుచరులు అంటూ ఆరోపించారు.
ఈ క్రమంలో తనను నిలదీసిన వారి వద్దకు చేతిలో మైక్ పట్టుకుని పరుగులు తీసిన ఎమ్మెల్యే వారిపై తిట్లతో విరుచుకుపడ్డారు. 'అవసరమైతే అయ్యన్నను తీసుకురండి' అంటూ ఆయన వారిపై ఆగ్రహించారు.