ట్రాక్టర్ నడిపిన సీఎం జగన్.. వీడియో ఇదిగో!
- వైయస్సార్ యంత్ర సేవా పథకాన్ని ప్రారంభించిన జగన్
- 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్డ్ కోత యంత్రాల పంపిణీ
- రైతన్నకు ప్రతి అడుగులో అండగా ఉన్నామన్న సీఎం
ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్వయంగా ట్రాక్టర్ నడిపి అందరినీ అలరించారు. వైయస్సార్ యంత్ర సేవా పథకాన్ని ఈరోజు జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతు గ్రూపుతో కలిపి ఆయన ట్రాక్టర్ నడిపారు. అనంతరం రైతు గ్రూపులకు మంజూరైన ట్రాక్టర్లు, కంబైన్డ్ కోత యంత్రాల పంపిణీ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్డ్ కోత యంత్రాలను పంపిణీ చేశారు. దీంతో పాటు 5,260 రైతు గ్రూప్ బ్యాంక్ ఖాతాలకు రూ. 175 కోట్ల సబ్సిడీని జగన్ బటన్ నొక్కి జమ చేశారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ఈరోజు మరో గొప్ప కార్యక్రమాన్ని ప్రాంభించామని చెప్పారు. రైతన్నకు ప్రతి అడుగులో అండగా ఉంటున్నామని తెలిపారు. విత్తనం దగ్గర నుంచి పంట అమ్మకం వరకు రైతులకు అండగా ఉన్నామని చెప్పారు. రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. రూ. 2,016 కోట్లతో 10,750 వైయస్సార్ యంత్ర సేవా కేంద్రాలను స్థాపించేందుకు శ్రీకారం చుట్టబోతున్నామని చెప్పారు. 3,800 కేంద్రాలకు 3,800 ట్రాక్టర్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
చంద్రబాబు హయాంలో రైతులకు అరకొర ట్రాక్టర్లను ఇచ్చారని జగన్ విమర్శించారు. గతంలో ట్రాక్టర్ల కొనుగోళ్లలో కుంభకోణాలు జరిగాయని చెప్పారు. రైతుల ఇష్టం మేరకే ట్రాక్టర్లను కొంటున్నామని తెలిపారు.