పదో తరగతి పరీక్షల ఫలితాలపై నారా లోకేశ్ విమర్శలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చిన విజయసాయిరెడ్డి!
- అమ్మఒడి, సంక్షేమ పథకాలకు విద్యార్థులను తగ్గించే కుట్ర జరిగిందన్న లోకేశ్
- ఉత్తీర్ణత శాతం తగ్గడానికి నారాయణ పేపర్ లీకేజీనే కారణమన్న విజయసాయిరెడ్డి
- దిగజారి ఆరోపణలు చేయడంలో ముందుంటావని విమర్శ
ఏపీలో పదో తరగతి పరీక్షల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. ఇది పదో తరగతి విద్యార్థుల ఫెయిల్యూర్ కాదని... జగన్ రెడ్డి ప్రభుత్వ ఫెయిల్యూర్ అని విమర్శించారు. అమ్మఒడి, సంక్షేమ పథకాలకు విద్యార్థులను తగ్గించే కుట్ర జరిగిందని ఆరోపించారు. పరీక్షల పేపర్ లీకేజీ, మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీసులతో ప్రభుత్వం అభాసుపాలయిందని చెప్పారు. ఈ వ్యాఖ్యలకు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.
కలెక్టర్లకు టార్గెట్లు పెట్టి పిల్లలు ఫెయిలయితే చర్యలు తీసుకుంటామని బెదిరించింది ఎవరని లోకేశ్ ను ప్రశ్నించారు. కింది స్థాయి నుంచి పైవరకు పాస్ పర్సెంటేజీని పెంచడానికి ఏం చేశారో తెలియదా? అని అన్నారు. పదో తరగతిలో ఉత్తీర్ణత శాతం తగ్గడానికి ప్రశ్నా పత్రాలను నారాయణ లీక్ చేయడమే కారణమని చెప్పారు. పిల్లల్ని అయోమయంలోకి నెట్టి మానసికంగా డిస్టర్బ్ చేసిన పాపం మీదేనని అన్నారు. దిగజారి ఆరోపణలు చేయడంలో ముందుంటావని విమర్శించారు. చదువు'కొన్న' వాడివి... రిజల్ట్స్ గురించి నీవు మాట్లాడటం ఏమిటని ఎద్దేవా చేశారు.