హిందూ సంప్రదాయం ప్రకారం పెంపుడు శునకాలకు పెళ్లి.. 500 మందితో భారీ ఊరేగింపు!

  • ఉత్తరప్రదేశ్‌లోని హమీర్పూర్ జిల్లాలో ఘటన
  • పెంపుడు శునకాలకు వివాహం చేసిన సాధువులు
  • వైరల్ అవుతున్న వీడియో
ఇద్దరు సాధువులు తాము పెంచుకుంటున్న శునకాలకు హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసి ఆపై భారీగా ఊరేగింపు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్‌లోని హమీర్పూర్ జిల్లా సుమెర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భరువగా గ్రామంలో జరిగిందీ వింత వివాహం.

 సౌంఖర్ అడవుల్లో మనసర్ బాబా శివాలయం ఉంది. ఆ గుడిలో ప్రధాన పూజారి అయిన స్వామి ద్వారాక దాస్ మహారాజ్‌ ఓ శునకాన్ని పెంచుకుంటున్నారు. దానికి పెళ్లి చేయాలని భావించిన ఆయన పరచాచ్‌లోని బజరంగబలి ఆలయ పూజారి అర్జున్ దాస్‌ పెంచుకుంటున్న శునకంతో వివాహం చేయాలని నిశ్చయించారు. ఈ మేరకు ఈ నెల 5న ముహూర్తం నిర్ణయించారు.

ఇక ఈ వివాహానికి తన శిష్యులను, భక్తులను ఆహ్వానించారు. శునకాలకు హిందూ సంప్రదాయ పద్ధతిలో శాస్త్రోక్తంగా వివాహం జరిపించారు. భూరి, కల్లూ అనే ఈ శునకాల పెళ్లికి హాజరైన వారికి పలు రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. వివాహం అనంతరం 500 మందితో శునకాలకు బరాత్ కూడా నిర్వహించారు. 

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో వధువు ‘భూరి’ మెడలో మంగళసూత్రం కూడా కనిపించడం విశేషం. అయితే, ఈ వివాహం జరిపించడం వెనకున్న కారణం మాత్రం తెలియరాలేదు. వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాల కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


More Telugu News