నడ్డా నేతృత్వంలో బీజేపీ ఏపీ కోర్ కమిటీ భేటీ... పొత్తులపై పవన్ వ్యాఖ్యలపై కీలక చర్చ
- ఏపీ పర్యటనలో జేపీ నడ్డా
- విజయవాడలో పార్టీ ఏపీ కోర్ కమిటీ సమావేశం
- పార్టీ ఎంపీలు టీజీ వెంకటేశ్, సుజనా చౌదరి, సీఎం రమేశ్ హాజరు
- హాజరైన వీర్రాజు, కన్నా, పురందేశ్వరి, జీవీఎల్
ఏపీ పర్యటనకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా సోమవారం మధ్యాహ్నం రాష్ట్రానికి చెందిన పార్టీ శక్తి కేంద్ర కమిటీలతో సమావేశమైన సంగతి తెలిసిందే. మంగళవారం కూడా ఏపీలోనే పర్యటించనున్న నడ్డా... రాత్రికి విజయవాడలోనే బస చేయనున్నారు. ఈ సందర్భంగా విజయవాడలో కాసేపటి క్రితం పార్టీకి సంబంధించిన ఏపీ కోర్ కమిటీ సమావేశాన్ని నడ్డా ప్రారంభించారు.
ఈ సమావేశానికి పార్టీ ఏపీ చీఫ్ సోము వీర్రాజుతో పాటుగా పార్టీ ఎంపీలు టీజీ వెంకటేశ్, సుజనా చౌదరి, సీఎం రమేశ్, కీలక నేతలు కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి, జీవీఎల్ నరసింహారావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చ జరిగినట్లు సమాచారం. అంతేకాకుండా వైసీపీ విషయంలో భవిష్యత్తు కార్యాచరణపైనా చర్చ జరిగిందని తెలుస్తోంది. వీటన్నింటి కంటే ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో ఆయా పార్టీలతో పొత్తుల దిశగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కీలక చర్చ జరిగినట్లు సమాచారం.