ఇది ఒక ప్రమాదకరమైన ప్రేమకథ: రానా
- 'విరాట పర్వం' ప్రెస్ మీట్ లో రానా
- ప్రొడ్యూస్ చేయమనే ఈ కథ తనవద్దకు వచ్చిందంటూ వివరణ
- తన పాత్రను తానే ఎంచుకున్నానంటూ స్పష్టీకరణ
- సాయిపల్లవి యాక్టింగ్ హైలైట్ అంటూ కితాబు
రానా - సాయిపల్లవి జంటగా 'విరాటపర్వం' సినిమా రూపొందింది. ఈ నెల 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంత సేపటి క్రితం జరిగిన ప్రెస్ మీట్ లో రానా మాట్లాడుతూ .. "ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయమంటూ ఈ కథ నా దగ్గరికి వచ్చింది. ఈ కథ అంతా కూడా సాయిపల్లవి చుట్టూ తిరుగుతుంది.
ఈ సినిమాలో నేను చేసిన పాత్ర .. నేను ఎంచుకున్నదే. నేను లేకపోతే ఈ సినిమా మరీ చిన్నదైపోతుందేమోనని అనిపించింది. కొన్ని ఫీలింగ్స్ నాకు బాగా వర్కౌట్ అవుతాయని అనుకున్నాను. ఇది అడవి నేపథ్యంలో జరిగే అందమైన ప్రేమకథ. ప్రేమనేది ఎంత డేంజర్ వరకూ వెళుతుందో .. అంత డేంజర్ వరకూ వెళ్లే ప్రేమకథ ఇది.
ఒక్క మాటలో చెప్పాలంటే ప్రమాదకరమైన ప్రేమకథ ఇది. కృష్ణవంశీ 'సిందూరం'.. 'అంతఃపురం'లా ఇది ఒక ప్రత్యేకమైన సినిమా. సాయిపల్లవి యాక్షన్ చూసితీరవలసిందే. ఇంతమంచి యాక్టర్ తో కలిసి చేయడం వలన నేను కూడా బాగానే చేశానని అనుకుంటున్నాను. నా కెరియర్లోనే ఇది చెప్పుకోదగిన సినిమా అవుతుంది" అన్నారు.