ఆత్మకూరులో భారీ మెజారిటీ లక్ష్యంగా వైసీపీ వ్యూహం... 7 మండలాలకు ఇంచార్జీలుగా ఏడుగురు మంత్రులు
- ఆత్మకూరు ఉప ఎన్నికలో ముగిసిన నామినేషన్ల దాఖలు
- మొత్తంగా 28 నామినేషన్లు దాఖలైనట్లు అధికారుల ప్రకటన
- భారీ మెజారిటీ సాధించే దిశగా వైసీపీ వ్యూహాలు
- 7 మండలాలకు ఇంచార్జీలుగా ఏడుగురు మంత్రులు
- వారితో సహకారం అందించేందుకు ఏడుగురు ఎమ్మెల్యేలకు బాధ్యతలు
ఏపీ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యంగా అధికార వైసీపీ అడుగులు వేస్తోంది. సోమవారంతో ఆత్మకూరు ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్లకు గడువు ముగియగా... వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి సహా 28 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. అయితే, నామినేషన్ల గడువు ముగిసేలోగా ఎంతమంది తమ నామినేషన్లను విత్‌డ్రా చేసుకుంటారన్నది చూడాలి.
ఈ క్రమంలో ఈ ఎన్నికపై వైసీపీ దృష్టి సారించింది. ఉప ఎన్నికలో లక్ష ఓట్లకు పైగా మెజారిటీని నిర్దేశించుకున్న ఆ పార్టీ... అందుకోసం భారీగా నేతలను రంగంలోకి దింపుతోంది. ఆత్మకూరు అసెంబ్లీ పరిధిలో 7 మండలాలు ఉండగా... ఒక్కో మండలానికి ఒక్కో మంత్రిని ఇంచార్జీగా నియమించింది. మంత్రికి సహకారం అందించేందుకు ఒక్కో నియోజక వర్గానికి ఒక్కో ఎమ్మెల్యేను కూడా ఆ పార్టీ బరిలోకి దించుతోంది. మొత్తంగా భారీ సంఖ్యలో నేతలను దించి అనుకున్న మెజారిటీ సాధించే దిశగా వైసీపీ పావులు కదుపుతోంది.