అనంతబాబు రిమాండ్ పొడిగింపు, బెయిల్‌పై రేపు విచారణ
- సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా అనంతబాబు
- సోమవారం రాజమహేంద్రవరం కోర్టుకు ఎమ్మెల్సీ
- ఈ నెల 20 వరకు రిమాండ్ పొడిగిస్తూ కోర్టు నిర్ణయం
తన వద్ద డ్రైవర్‌గా పనిచేసిన సుబ్రహ్మణ్యంను హత్య చేసిన కేసులో అరెస్టైన వైసీపీ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ అనంతబాబుకు రిమాండ్ పొడిగిస్తూ రాజమహేంద్రవరం కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20 వరకు అనంతబాబు రిమాండ్‌ను పొడిగిస్తున్నట్లు కోర్టు సోమవారం ప్రకటించింది. అంతేకాకుండా అనంతబాబు బెయిల్ పిటిషన్‌పై రేపు (మంగళవారం) విచారణ చేపట్టనున్నట్లు కోర్టు తెలిపింది.
సుబ్రహ్మణ్యాన్ని తానే చంపినట్లు వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న అనంతబాబు ఒప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేయగా...ఆయనను జ్యూడిషియల్ రిమాండ్‌కు తరలిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ రిమాండ్ గడువు ముగియడంతో సోమవారం అనంతబాబును పోలీసులు కోర్టులో హాజరు పరచగా... ఈ నెల 20 వరకు ఆయనకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీంతో అనంతబాబును పోలీసులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు.