ఆత్మకూరు ఉప ఎన్నికల బరిలో 28 మంది
- గౌతమ్ రెడ్డి మరణంతో ఆత్మకూరుకు ఉప ఎన్నిక
- వైసీపీ అభ్యర్థిగా గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి నామినేషన్
- నామినేషన్లకు సోమవారంతో ముగిసిన గడువు
- చివరి రోజున దాఖలైన 13 నామినేషన్లు
- మొత్తంగా 28 నామినేషన్లు దాఖలైనట్లు అధికారుల వెల్లడి
గుండెపోటుతో మృతి చెందిన దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అసెంబ్లీ స్థానం ఆత్మకూరు ఉపఎన్నిక బరిలో దిగేందుకు ఏకంగా 28 మంది అభ్యర్ధులు సిద్ధమయ్యారు. ఈ ఎన్నికలో అధికార పార్టీ నుంచి గౌతమ్ రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో చనిపోయిన నేతల కుటుంబ సభ్యులకే టికెట్ ఇస్తే పోటీ చేయరాదన్న సంప్రదాయాన్ని గౌరవించిన టీడీపీ పోటీకి దూరంగా ఉండిపోయింది.
ఇక విక్రమ్ రెడ్డితో పాటు ఇప్పటికే చాలా మంది ఈ ఉప ఎన్నికలో నామినేషన్లు దాఖలు చేశారు. సోమవారం నామినేషన్ల గడువుకు చివరి రోజు కావడంతో ఈ ఒక్కరోజే ఏకంగా 13 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వెరసి ఈ ఉప ఎన్నికకు ఇప్పటిదాకా 28 నామినేషన్లు దాఖలైనట్లైంది. అయితే నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసేలోగా వీరంతా బరిలోనే నిలుస్తారా? తప్పుకుంటారా? అన్నది తేలాల్సి ఉంది.