ఏపీలో ఉద్యోగుల బదిలీలకు జగన్ గ్రీన్ సిగ్నల్
- ఉద్యోగుల బదిలీల ఫైల్‌పై సంతకం చేసిన సీఎం జగన్
- ఒకటి, రెండు రోజుల్లో విడుదల కానున్న ఉత్తర్వులు
- ఈ నెల 17లోగా బదిలీలను పూర్తి చేయాలని జగన్ సూచన
ఏపీలో ప్రభుత్వ సాధారణ ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ప్రతిపాదిత ఫైల్‌పై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతకం చేశారు. ఈ క్రమంలో బదిలీల్లో ఉద్యోగుల అర్హత, ఖాళీల వివరాలు తదితర నిబంధనలతో రేపు లేదంటే ఎల్లుండి ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలున్నాయి.
ఇదిలా ఉంటే... ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన ఫైల్‌పై సంతకం చేసిన సమయంలో అధికార యంత్రాంగానికి సీఎం జగన్ పలు సూచనలు చేసినట్లు సమాచారం. ఉద్యోగుల బదిలీలన్నీ ఈ నెల 17లోగా పూర్తి అయ్యేలా చూడాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఎలాంటి వివాదాలు, ఆరోపణలు లేకుండా బదిలీల ప్రక్రియను ముగించాలని కూడా ఆయన సూచించినట్లు సమాచారం.