తెలంగాణ‌లో సీపీగెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. నేటి నుంచే ద‌ర‌ఖాస్తులు

  • జులై 4 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌
  • ఆల‌స్య రుసుముతో జులై 15 వ‌ర‌కూ ద‌ర‌ఖాస్తుల‌కు అవ‌కాశం
  • జులై 20 నుంచి ఆన్‌లైన్‌లో ప‌రీక్ష‌లు
  • సీపీగెట్ ద్వారానే రాష్ట్రంలోని విశ్వ‌విద్యాలయాల్లో పీజీ ప్ర‌వేశాలు
తెలంగాణ విశ్వ విద్యాల‌యాల్లో సంప్ర‌దాయ పీజీ కోర్సుల ప్ర‌వేశానికి ఉద్దేశించిన ఉమ్మ‌డి ప్ర‌వేశ ప‌రీక్ష (సీపీగెట్‌) నోటిఫికేష‌న్ సోమ‌వారం విడుదలైంది. రాష్ట్ర ఉన్న‌త విద్యా  మండ‌లి చైర్మ‌న్ లింబాద్రి ఈ నోటిఫికేష‌న్‌ను విడుదల చేశారు. ఈ నోటిఫికేష‌న్ ప్ర‌కారం ఈ రోజు (జూన్ 6) నుంచి జులై 4 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు పంపుకునే వీలుంది. ఆల‌స్య రుసుముతో జులై 15 వ‌ర‌కు కూడా అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. జులై 20 నుంచి ఆన్‌లైన్ విధానంలో ప‌రీక్ష‌లు జ‌రుగుతాయి. 

ఈ ప్ర‌వేశ ప‌రీక్ష‌లో వ‌చ్చిన మార్కుల ఆధారంగా తెలంగాణ‌లోని ఉస్మానియా, కాక‌తీయ‌, శాత‌వాహ‌న‌, తెలంగాణ‌, మ‌హాత్మా గాంధీ, పాల‌మూరు, జేఎన్టీయూ హైద‌రాబాద్‌, మ‌హిళా వ‌ర్సిటీల్లో సంప్ర‌దాయ పీజీ కోర్సుల్లో ప్రవేశాలు క‌ల్పిస్తామ‌ని లింబాద్రి తెలిపారు.


More Telugu News