ఏపీలో మారిన వాతావరణం... పలు జిల్లాల్లో వర్షాలు

  • రాష్ట్రంలో నిన్నటిదాకా మండిన ఎండలు
  • గతరాత్రి నుంచి వర్షాలు
  • ఊరట పొందిన ప్రజలు
  • పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతం
  • తగ్గిన ఉష్ణోగ్రతలు
నిన్నటిదాకా మండే ఎండలతో ఉక్కిరిబిక్కిరైన ఏపీ ప్రజలకు ఊరట కలిగిస్తూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. భానుడి భగభగలతో అట్టుడికిపోయిన జనాలు గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో ఉపశమనం పొందారు. ఇవాళ రాష్ట్రంలోని చాలాప్రాంతాల్లో మేఘావృతమై ఉండడమే గాక, చల్లని గాలులు వీస్తుండడంతో ప్రజలు సేద దీరుతున్నారు. 

కాగా, కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మెదేహాల్ వద్ద వంతెన కోతకు గురికావడంతో ఏపీ-కర్ణాటక రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జిల్లాలో పలు వాగులు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అటు, కోనసీమలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మారేడుమిల్లి, కొయ్యూరు, అడ్డతీగల ప్రాంతాల్లో కుండపోత వానలు కురిశాయి. కొన్నిచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 

వైజాగ్ లో రుషికొండ, మధురవాడ, ఎండాడ, పీఎం పాలెం, ఆనందపురం ప్రాంతాల్లో వర్షం కురిసింది. అమలాపురంలోనూ గణనీయ స్థాయిలో వర్షపాతం నమోదైంది.


More Telugu News