దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. 25 వేలు దాటిన యాక్టివ్ కేసులు.. అప్డేట్స్ ఇవిగో!

  • గత 24 గంటల్లో 4,518 మందికి కరోనా పాజిటివ్
  • దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 25,782
  • దేశంలో రికవరీ రేటు 98.73 శాతం
మన దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. వరుసగా రెండో రోజు నాలుగు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 4,518 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 2,779 మంది కోలుకోగా... 9 మంది మరణించారు. 

ఇక ప్రస్తుతం దేశంలో 25,782 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,31,81,335కి చేరుకుంది. మొత్తం 4,26,30,852 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 5,24,701 మంది మృతి చెందారు. దేశంలో రోజువారీ రికవరీ రేటు 98.73 శాతంగా, క్రియాశీల రేటు 0.06 శాతంగా, మరణాల రేటు 1.22 శాతంగా ఉంది. నిన్న 2,57,187 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.


More Telugu News