అందరి దృష్టి ఇప్పుడు 'విక్రమ్ 2'పైనే!
- ఈ నెల 3వ తేదీన విడుదలైన 'విక్రమ్'
- భారీ తారాగణంతో రూపొందిన సినిమా
- ఓవర్సీస్ లో వసూళ్ల పరంగా మరింత దూకుడు
- సీక్వెల్ పై పెరుగుతున్న ఆసక్తి
మొదటి నుంచి కూడా కమలహాసన్ ప్రయోగాలు చేస్తూనే వస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన స్థాయికి తగిన హిట్ పడలేదు. ఈ విషయంలో ఆయన అభిమానుల అసంతృప్తికి 'విక్రమ్' సినిమా ఫుల్ స్టాప్ పెట్టేసింది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఓవర్సీస్ లోను ఒక రేంజ్ లో దూసుకుపోతోంది.
ఈ సినిమాలో ప్రధానమైన ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి కనిపిస్తే, కమల్ ఆయనపై పోరాడుతూ వస్తాడు. డ్రగ్స్ మాఫియా అసలు సూత్రధారిగా సినిమా చివరిలో సూర్య బయటికి వస్తాడు. ఆల్రెడీ అప్పటికే ఆయన ఇలాకాలోకి కమల్ ఎంటరవుతాడు. ఈ సినిమాకి సీక్వెల్ ఉన్నట్టుగా హింట్ ఇస్తూ ఇక్కడే లోకేశ్ శుభం కార్డు వేశాడు.
ఇక 'విక్రమ్' సినిమా క్లైమాక్స్ కి చేరువవుతూ ఉండగా లోకేశ్ 'ఖైదీ' ప్రస్తావన తీసుకొచ్చాడు. కార్తి కనిపించడుగానీ .. ఆయన అసిస్టెంట్ .. కూతురు పాత్రలను చూపించాడు. చూస్తుంటే 'విక్రమ్ 2'లో సూర్యతో పాటు కార్తిని కూడా భాగం చేయనున్నట్టు తెలుస్తోంది. ఒక సినిమా సీక్వెల్ లోకి మరో సినిమాలోని పాత్రను ఎంటర్ చేయడమనే కొత్త ప్రయోగం లోకేశ్ చేయబోతున్నాడు. అందుకే అందరూ ఇప్పుడు సీక్వెల్ పై దృష్టిపెట్టారు.