విద్యాబాలన్ అంటే నాకు చాలా ఇష్టం: హీరో నాని
- చదువుల్లో తాను బెస్ట్ స్టూడెంట్ ని కాదన్న నాని
- పరీక్షలకు స్లిప్పులు తీసుకెళ్లి దొరికిపోయానని వెల్లడి
- 'నేను లోకల్' సినిమాలో కొన్ని సీన్లు తన జీవితంలో జరిగినవేనని వ్యాఖ్య
తన సహజసిద్ధమైన నటనతో అలరిస్తూ ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరో నేచురల్ స్టార్ నాని. తాజాగా 'అంటే.. సుందరానికీ' సినిమాతో ఆయన తన అభిమానులను అలరించడానికి మరోసారి సిద్ధమవుతున్నారు. మరోవైపు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
చదువుకునే రోజుల్లో తనకు ఇంగ్లీష్ సరిగా వచ్చేది కాదని... కానీ, ఇంగ్లీష్ లో మార్కులు మాత్రం ఎక్కువ వచ్చేవని నాని చెప్పారు. ప్రతి ప్రశ్నకు 'టైటానిక్' సినిమా కథ రాసేవాడినని... అందుకే మార్కులు పడిపోయేవని తెలిపారు. పరీక్షలంటే తనకు చాలా భయమని... అందుకే పరీక్షలకు షూస్ లో స్లిప్పులు పెట్టుకుని వెళ్లేవాడినని చెప్పారు. రెండు, మూడు సార్లు దొరికిపోయానని... అయితే అదృష్టం బాగుండి డీబార్ కాలేదని తెలిపారు.
చదువుల్లో తాను బెస్ట్ స్టూడెంట్ ను కాదని నాని చెప్పారు. ఒకసారి అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యానని... నాన్న చూస్తే తిడతారనే భయంతో ప్రోగ్రెస్ రిపోర్ట్ లో తానే సంతకం చేశానని తెలిపారు. అయితే అలాంటి పని చేయడం అదే మొదటిసారి, చివరిసారి కూడా అని చెప్పారు. ఆ పని చేసినందుకు తాను చాలా గిల్టీగా ఫీలయ్యానని అన్నారు.
తనకు అమితాబ్ బచ్చన్, విద్యాబాలన్ అంటే చాలా ఇష్టమని... అవకాశం వస్తే వారితో ఒక సీన్ లో అయినా నటించాలని ఉందని చెప్పారు. 'నేను లోకల్' సినిమాలో కొన్ని సీన్లు తన జీవితంలో జరిగినవేనని చెప్పారు.