'పుష్ప 2' కోసం నడివయసు పాత్రలో అల్లు అర్జున్!

'పుష్ప 2' కోసం నడివయసు పాత్రలో అల్లు అర్జున్!
  • సంచలన విజయాన్ని సాధించిన 'పుష్ప'
  • 'పుష్ప 2' కథపై జరుగుతున్న కసరత్తు
  • త్వరలోనే మొదలుకానున్న రెగ్యులర్ షూటింగ్
  • 400 కోట్ల బడ్జెట్ ను కేటాయించినట్టు సమాచారం
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'పుష్ప' సంచలన విజయాన్ని సాధించింది. దాంతో ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగు కోసం సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఈ సినిమాలో హీరోకి - విలన్ కి మధ్య జరిగే పోరాటమే ప్రధానంగా హైలైట్ చేయనున్నారు.

ఈ సినిమాలో బన్నీని నడివయసు పాత్రలో చూపించనున్నారని అంటున్నారు. సినిమా చివరలో ఆయన ఆ లుక్ తో కనిపిస్తాడా?  లేదంటే పోలీసుల బారి నుంచి తప్పించుకోవడానికి ఆయన ఆ గెటప్ వేస్తాడా? అనేది చూడాలి. నడి వయసు పాత్రలో ఆయన తెరపై కనిపించడం మాత్రం పక్కా అంటున్నారు. 

'పుష్ప' సినిమా సక్సెస్ కి కథాకథనాలతో పాటు దేవిశ్రీ పాటలు కూడా చాలా వరకూ కారణమయ్యాయి. దాంతో ఈ సారి తన నుంచి అంతకు మించిన అవుట్ పుట్ ఇవ్వడానికి దేవిశ్రీ రెడీ అవుతున్నాడని చెబుతున్నారు. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం దిశా పటానీని తీసుకోనున్నట్టు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమా కోసం 400 కోట్లను కేటాయించినట్టు సమాచారం.


More Telugu News