బీజేపీ-జనసేన మధ్య పొత్తు కొనసాగుతుంది: పోతిన వెంకటమహేశ్

  • పవన్‌‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా నడ్డా ప్రకటించాలన్న పోతిన
  • బీజేపీ-జనసేన బంధం బలోపేతం అవుతుందని ధీమా
  • జగన్ అవినీతి గురించి నడ్డా ప్రజలకు చెప్పాలని డిమాండ్
భారతీయ జనతా పార్టీ-జనసేన మధ్య పొత్తు కొనసాగుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకటమహేశ్ తేల్చి చెప్పారు. ఇరు పార్టీల మధ్య బంధం మరింత బలపడుతుందని, ప్రజల మద్దతు లభిస్తుందని చెప్పారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిన్న విలేకరులతో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఏపీ పర్యటనకు వస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. బీజేపీ-జనసేన కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కల్యాణ్‌ పేరును ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. 

అలాగే, రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అవినీతి, అసమర్థత గురించి నడ్డా ప్రజలకు వివరించాలని, అప్పుడు వాస్తవాలేమిటో ప్రజలకు తెలుస్తాయని అన్నారు. కేంద్రంలోని బీజేపీ పెద్దలు కూడా జగన్ పాలనను ఇష్టపడడం లేదన్నారు. రాష్ట్ర పర్యటనకు వస్తున్న నడ్డాకు జనసేన తరపున స్వాగతం పలుకుతామని పోతిన మహేశ్ తెలిపారు.


More Telugu News