ఏపీలో పొత్తులపై పురందేశ్వరి స్పందన
- పొత్తులపై మూడు ఆప్షన్లు ఇచ్చిన పవన్
- మరోసారి చర్చనీయాంశంగా పొత్తుల అంశం
- జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందని స్పష్టీకరణ
- ఇతర పార్టీలతో పొత్తు బీజేపీ హైకమాండ్ నిర్ణయిస్తుందని వెల్లడి
జనసేన పార్టీ పవన్ కల్యాణ్ ఏపీలో పొత్తులపై మూడు ఆప్షన్లు ఇచ్చిన నేపథ్యంలో, అందరి దృష్టి మరోసారి పొత్తు రాజకీయాలపైకి మళ్లింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి కూడా పొత్తుపై స్పందించారు. జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందని వెల్లడించారు. జనసేన, బీజేపీ మధ్య చక్కని సమన్వయం ఉందని పేర్కొన్నారు.
అయితే ఎన్నికల సమయంలో ఇతర పార్టీలతోనూ పొత్తు పెట్టుకునే విషయంలో బీజేపీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఏపీలో బీజేపీని ప్రజలు దీవించాలని అన్నారు. రాష్ట్రానికి బీజేపీ అండగా నిలుస్తుందని తెలిపారు. విజయవాడ బీజేపీ కార్యాలయంలో జిల్లా శక్తి కేంద్ర ప్రముఖుల సమావేశంలో పురందేశ్వరి ఈ వ్యాఖ్యలు చేశారు.