పవన్ కల్యాణ్ కు ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి సవాల్
- 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసి గెలవాలని డిమాండ్
- ఎవరితో పొత్తు పెట్టుకుంటే తమకేంటని వ్యాఖ్య
- జగన్ సింహం.. ఎవరూ ఏమీ చేయలేరని కామెంట్
ఎవరు.. ఎవరితో ఎన్ని పొత్తులు పెట్టుకున్నా వైసీపీని ఓడించలేరని ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అన్నారు. ఎవరు ఎవరితోనైనా పొత్తులు పెట్టుకోవచ్చన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తిరుపతిలో బాలాజీ డైరీ ప్రాంగణంలో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు ఆయన సవాల్ విసిరారు. రాష్ట్రంలోని 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసి గెలవాలన్నారు.
కులాలు, మతాల పేరు చెప్పుకొని ఓట్లడిగే పద్ధతిని దూరం పెట్టాలని సూచించారు. కులం పేరు చెప్పుకొని ఓట్లడుగుతున్న పవన్ కల్యాణ్ ఒంటరిగా పోటీ చేసి తానేంటో నిరూపించుకోవాలన్నారు. పవన్ కల్యాణ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటే తమకేంటని, పెట్టుకోకపోతే తమకేంటని అన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి సింహం అని, ఆయన్ను ఎవరూ ఏమీ చేయలేరని తేల్చి చెప్పారు.