సీఈసీ సాహసం.. పోలింగ్ బూత్ కు వెళ్లేందుకు 18కిలోమీటర్ల ట్రెక్కింగ్

  • ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలో మారుమూలన పోలింగ్ బూత్
  • అక్కడి వరకు ట్రెకింగ్ ద్వారా వెళ్లిన సీఈసీ 
  • ఇతర సిబ్బందిలో ప్రోత్సాహమే తన లక్ష్యమన్న సీఈసీ
భారత ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ అధికారులకు మార్గదర్శకంగా వ్యవహరించారు. ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలోని మారుమూల ప్రాంతంలో ఒక పోలింగ్ బూత్ కు 18కిలోమీటర్ల పాటు ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్లారు. ఒక అధికారి ఇంత సాహసం చేయడం ఇదే మొదటిసారి. జమ్మూకశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, ఉత్తరాంఖండ్ ప్రాంతాల్లోని కొన్ని బూత్ లకు చేరుకోవడం ఎంతో కష్టమైన పనిగా అయన పేర్కొన్నారు.

‘‘ఈ పోలింగ్ స్టేషన్ ఉత్తరాఖండ్ లోని దుమక్ గ్రామంలో ఉంది. మారుమూలనున్న పోలింగ్ బూతులకు వెళ్లే దిశగా పోలింగ్ సిబ్బందిలో చైతన్యం తీసుకురావాలన్నది నా యోచన’’అని రాజ్ కుమార్ చెప్పారు. రాజీవ్ కుమార్ కు సాహసోపేత నిర్ణయాలు కొత్త కాదు. లీవ్ ట్రావెల్ కన్సెషన్ లో సెలవులపై ఎక్కువ రోజులు వెళ్లకుండా చూడాలని గత నెల మొదట్లో ఆదేశించారు.


More Telugu News