ఇమ్రాన్ హత్యకు కుట్ర..!.. భద్రత కట్టుదిట్టం

  • ఇస్లామాబాద్ లో నేడు ఇమ్రాన్ పర్యటన
  • హత్యకు కుట్ర అంటూ వార్తలు రావడంతో భద్రత కట్టదిట్టం 
  • రాజధానిలో 144 సెక్షన్ అమలు
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విషయంలో భద్రతా సంస్థలు అప్రమత్తయ్యాయి. ఇమ్రాన్ హత్యకు కుట్ర జరుగుతోందంటూ ఆరోపణలు వెలుగు చూడడంతో భద్రతా సంస్థలు వేగంగా స్పందించాయి. ఇస్లామాబాద్, చుట్టుపక్కల ప్రాంతాలను భద్రతా సంస్థలు కట్టదిట్టం చేశాయి. 

పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లో ఇప్పటికే 144 సెక్షన్ అమలు చేశామని, ప్రజలు గుమికూడడాన్ని నిషేధించినట్టు స్థానిక పోలీసు ఒకరు తెలిపారు. ఇస్లామాబాద్ లోని బనిగాలాలో ఇమ్రాన్ ఖాన్ ఆదివారం పర్యటించనున్నారు. ఇమ్రాన్ ఖాన్ కు ఎటువంటి హాని జరగకుండా చట్టప్రకారం కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తున్నాయి. 

ఇమ్రాన్ ఖాన్ పదవిలో ఉండగా, పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా భారత్ ను ప్రశంసించడం తెలిసిందే. త్వరగా ఎన్నికలు నిర్వహించాలంటూ అయన ప్రస్తుత సర్కారుకు అల్టిమేటం కూడా జారీ చేశారు.


More Telugu News