గిన్నిస్ పుస్తకంలోకి 111 అడుగుల ‘యోగి’ కేక్..!

  • యూపీ సీఎం పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్
  • గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించుకోనున్న పొడవైన కేక్
  • అయోధ్యలో 5 లక్షల మందితో హనుమాన్ చాలీసా పారాయణ
ఈ కేక్ వందలాది మంది నోటీని తీపి చేయగలదు. ఎందుకంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పుస్తకంలోకి చోటు సంపాదించుకోనున్న ఈ కేక్ కు ఒక ప్రత్యేకత ఉంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ 50వ పుట్టిన రోజు సందర్భంగా రూపొందించినది. ముఖ్యమంత్రి యోగి మద్దతుదారులు ఈ కేక్ ను తయారు చేయించారు. దీని పొడవు 111 అడుగులు. ప్రపంచంలో ఇప్పటి వరకు అత్యంత పొడవైన కేక్ రికార్డ్ 108.27 అడుగులు ఉండగా, అది చెరిగిపోనుంది.

ప్రపంచంలో అతి పొడవైన కేక్ ను కోసిన రికార్డు సృష్టించాలన్న లక్ష్యంతో ఈ కేక్ ను రూపొందించారు. బీజేపీ నవాజ్ గంజ్ ఎమ్మెల్యే ఎంపీ ఆర్య నియోజకవర్గం పరిధిలో ఆదివారం సాయంత్రం ఈ కేక్ ను కట్ చేయనున్నారు. 150 క్వింటాళ్ల ఉక్కుతో తయారైన నిర్మాణంపై దీన్ని ఉంచనున్నారు. ముఖ్యమంత్రి శాంతియుత పాలన అందిస్తునందుకు ఈ కేక్ ను పీస్ ఆఫ్ కేక్ గా బీజేపీ నాయకులు అభివర్ణిస్తున్నారు. మరోవైపు యోగి ఆదిత్యనాథ్ పుట్టిన రోజు సందర్భంగా అయోధ్యలో 5 లక్షల మంది హనుమాన్ చాలీసా పారాయణం చేయనున్నారు.


More Telugu News