మహిళల మర్యాదకు భంగం కలిగించేలా ఉందంటూ ఓ డియోడరెంట్ యాడ్ తొలగింపు
- 'షాట్' బాడీ స్ప్రే యాడ్ పై కేంద్రం కొరడా
- యాడ్ ను ప్రసారం చేయడంపై నిషేధం
- విచారణకు ఆదేశించిన కేంద్ర సమాచార ప్రసార శాఖ
- అడ్వర్టయిజింగ్ నియమావళిని ఉల్లంఘించిందంటూ చర్యలు
కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఓ డియోడరెంట్ యాడ్ పై కొరడా ఝుళిపించింది. లేయర్ కంపెనీ తన 'షాట్' డియోడరెంట్ బాడీ స్ప్రేకు ప్రచారం కల్పించేందుకు రూపొందించిన యాడ్ లో మహిళలను వారి మర్యాదకు భంగం కలిగించేలా చిత్రీకరించారని కేంద్రం భావిస్తోంది.
ఈ నేపథ్యంలో సదరు డియోడరెంట్ యాడ్ పై నిషేధం విధించింది. అడ్వర్టయిజింగ్ నియమావళిని అనుసరించి దీనిపై విచారణకు ఆదేశించింది. అంతేకాదు, యూట్యూబ్, ట్విట్టర్ లకు కూడా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ లేఖలు రాసింది. ఆ యాడ్ ను తొలగించాలని ఆదేశించింది.
సోషల్ మీడియాలో ఈ యాడ్ పై తీవ్ర దుమారం చెలరేగింది. ఓ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఈ యాడ్ ప్రసారం కాగా, మహిళలపై అత్యాచారాలకు పురిగొల్పే విధంగా ఆ యాడ్ ఉందని నెటిజన్లు మండిపడుతున్నారు. అటు, అడ్వర్టయిజింగ్ కౌన్సిల్ ఆఫ్ ఆండియా (ఏఎస్ సీఐ) కూడా దీనిపై స్పందించింది. ఈ యాడ్ ఏఎస్ సీఐ నియమావళిని తీవ్రస్థాయిలో ఉల్లంఘించిందని పేర్కొంది.