మీది చేతగాని ప్రభుత్వం... మంత్రి అంబటిపై సోము వీర్రాజు ఆగ్రహం
- రెండున్నరేళ్లుగా ఏం చేశారంటూ నిలదీసిన వీర్రాజు
- కేంద్ర మంత్రి ప్రశ్నించేదాకా వైసీపీ ప్రభుత్వంలో చలనం లేదని విమర్శ
- సవరించిన అంచనాలకే ఆమోదం ఇవ్వాలని ఎలా కోరతారన్న వీర్రాజు
పోలవరం ప్రాజెక్టులోని కీలక భాగమైన డయాఫ్రమ్ వాల్ వరద తాకిడికి కొట్టుకుపోవడం, దానికి గల కారణాలపై ఏళ్లతరబడి అన్వేషణ సాగుతున్న వైనంపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుల మధ్య ట్వీట్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా శనివారం సోము వీర్రాజు మరో ట్వీట్‌ను అంబటికి సంధించారు. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి గల కారణాలను నిగ్గు తేల్చలేని చేతగాని ప్రభుత్వం మీదంటూ అంబటిపై ఆయన ఫైర్ అయ్యారు. రెండున్నరేళ్లుగా ఈ దిశగా ఏం చేశారో చెప్పాలని ఆయన అంబటిని ప్రశ్నించారు.
డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి గల కారణాలను అన్వేషించడానికి నిపుణుల సాయం తీసుకోవాల్సి ఉన్నా.. ఆ దిశగా వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగడం లేదని సోము వీర్రాజు విమర్శించారు. అసలు డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి గల కారణాలేమిటో నిగ్గు తేల్చేందుకు ఇప్పటిదాకా నిపుణులను ఎందుకు పిలవలేదని సాక్షాత్తు కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రశ్నిస్తే తప్పించి వైసీపీ ప్రభుత్వం మేల్కోలేదని వీర్రాజు మండిపడ్డారు. పోలవరం అంచనాలను పెంచాలంటూ నాడు చంద్రబాబు కోరితే... నాడు ఆరోపణలు గుప్పించిన సీఎం జగన్ ఇప్పుడు అవే అంచనాలకు ఆమోదం తెలపాలని ఎలా కోరతారని వీర్రాజు ప్రశ్నించారు.