మరి సత్తిబాబు సంగతేంటి సార్?... సీఎం జగన్‌కు వర్ల రామయ్య ప్రశ్న!
- ఏపీ పదో తరగతి ఫలితాల వెల్లడి సోమవారానికి వాయిదా
- జగన్ సర్కారును ప్రశ్నిస్తూ వర్ల రామయ్య ట్వీట్
ఏపీలో పదో తరగతి ఫలితాల విడుదలను సోమవారానికి వాయిదా వేయడంపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందులో భాగంగా టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య సీఎం జగన్‌ను ఉద్దేశించి ఓ ట్వీట్ వదిలారు. రాష్ట్ర పరిపాలన అంటే ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చినంత సులభం కాదని వర్ల వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
పదో తరగతి పరీక్షా ఫలితాల వెల్లడి అని ప్రకటించి, వెనక్కి తగ్గి వాయిదా వేయడం ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనమని సదరు ట్వీట్‌లో వర్ల వ్యాఖ్యానించారు. గతంలో ఇటువంటి సందర్భాలలో సంబంధిత మంత్రి రాజీనామా చేసేవారని ఆయన గుర్తు చేశారు. మరి విద్యాశాఖ మంత్రిగా ఉన్న సత్తిబాబు సంగతేంటి సార్? అంటూ ఆయన సీఎం జగన్‌ను ప్రశ్నించారు.