మంత్రులందరితో రాజీనామా చేయిస్తున్న ఒడిశా ముఖ్యమంత్రి
- కేబినెట్ పునర్వ్యవస్థీకరణ దిశగా పట్నాయక్
- మంత్రులందరూ రాజీనామాలు చేయాలని ఆదేశం
- స్పీకర్ పదవికి సూర్యనారాయణ పాత్రో రాజీనామా
- నవీన్ కొత్త కేబినెట్‌లో ఆయనకు మంత్రి పదవి ఖాయమంటూ ప్రచారం
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ శనివారం ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కేబినెట్‌లోని మంత్రులందరినీ రాజీనామాలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో మంత్రులందరూ తమ పదవులకు రాజీనామాలు చేయనున్నారు. అదే సమయంలో స్పీకర్‌గా ఉన్న సూర్యనారాయణ పాత్రో కూడా ఆ పదవికి రాజీనామా చేశారు.
తన కేబినెట్‌ను సమూలంగా ప్రక్షాళన చేసే దిశగా నవీన్ పట్నాయక్ సాగుతున్నారని, ఈ క్రమంలోనే ఆయన తన కేబినెట్‌లోని మంత్రులతో రాజీనామాలు చేయిస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారిని తొలగించి కొత్త వారితో కేబినెట్‌ను పునర్వ్యవస్థీకరించుకోవడానికి నవీన్ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా స్పీకర్ సూర్యనారాయణ పాత్రోకు తన కేబినెట్‌లో కీలక మంత్రిత్వ శాఖను అప్పగించనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.