గ్యాంగ్ రేప్ నిందితులు పోలీసులను తప్పుదారి పట్టించేందుకు ఏం చేశారో తెలుసా?
- సెల్ ఫోన్లను గోవాకు పంపి కర్ణాటకకు చెక్కేసిన నిందితులు
- ఐదుగురూ ఐదు మార్గాల మీదుగా హైదరాబాద్ నుంచి పరారీ
- అత్యాచారానికి వాడిన ఇన్నోవాను దాచి పెట్టిన నిందితులు
- ప్రభుత్వ వాహనం అన్న స్టిక్కర్ తో ఇన్నోవా కారు
- ఇంకా టెంపరరీ రిజిస్ట్రేషన్‌లోనే కారు ఉన్నట్లు గుర్తింపు
హైదరాబాద్‌లోని ఆమ్నేషియా పబ్ సమీపంలో బాలికను అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులు ఈ కేసు నుంచి ఎలా తప్పించుకోవాలన్న విషయంపై ముందే పక్కా ప్లాన్ వేసుకున్నట్లు తెలుస్తోంది. బాలికను ఇన్నోవా కారులో ఎక్కించుకుని దాదాపుగా 2 గంటల పాటు ఆమెపై కారులోనే గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డ నిందితులు ఆ తర్వాత బాలికను ఆమ్నేషియా పబ్ వద్దే దింపేసి వెళ్లినట్లు పోలీసులు తేల్చారు. తాజాగా పోలీసుల దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
గ్యాంగ్ రేప్‌పై బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయాన్ని తెలుసుకున్న నిందితులు పోలీసులకు చిక్కకూడదన్న భావనతో తామంతా గోవాకు వెళుతున్నామని చెప్పి... తమ సెల్ ఫోన్లను మాత్రం గోవాకు పంపి వారు మాత్రం కర్ణాటకకు పరారయ్యారు. ఇక హైదరాబాద్ నుంచి పరారయ్యే సమయంలో ఐదుగురూ ఐదు మార్గాల్లో పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు.
ఇక ఇన్నోవా కారును కూడా నిందితులు దాచి పెట్టేశారు. ఈ కారుకు ప్రభుత్వ వాహనం అన్న స్టిక్కర్ మాత్రమే ఉందని సమాచారం. అంతేకాకుండా ఈ కారు ఇంకా టెంపరరీ రిజిస్ట్రేషన్ మీదే ఉందట. మొత్తంగా నిందితుల్లో ఇద్దరు మేజర్లు, ముగ్గురు మైనర్లు అయినప్పటికీ వారంతా కలిసి పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఇలా చాలా మార్గాలనే ఆశ్రయించిన వైనం ఆసక్తి రేకెత్తిస్తోంది.