రాజ్యసభకు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం గౌరవంగా భావిస్తున్నా: విజయసాయిరెడ్డి
- రాజ్యసభకు ఏపీ నుంచి నలుగురు ఏకగ్రీవం
- సీఎం జగన్ దంపతులకు కృతజ్ఞతలు తెలిపిన విజయసాయి
- రాష్ట్రాభివృద్ధికి పాటుపడతానని ప్రతిజ్ఞ
ఏపీలో 4 రాజ్యసభ స్థానాలకు వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవం కావడం తెలిసిందే. వారిలో విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు. ఆయన రెండో పర్యాయం రాజ్యసభలో అడుగుపెట్టబోతున్నారు. దీనిపై ఆయన ట్విట్టర్ లో స్పందించారు.
వరుసగా రెండోసారి రాజ్యసభకు ఏకగ్రీవం కావడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ అవకాశం కల్పించిన సీఎం జగన్ కు, శ్రీమతి భారతమ్మకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు విజయసాయి పేర్కొన్నారు. ఇకముందు కూడా రాష్ట్రాభివృద్ధి కోసం అవిశ్రాంత కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నానని తెలిపారు.
విజయసాయితో పాటు ఏపీ కోటాలో బీసీ నేత ఆర్.కృష్ణయ్య, నిరంజన్ రెడ్డి, బీద మస్తాన్ రావు కూడా రాజ్యసభకు ఏకగ్రీవం అయ్యారు.
.