పెద్దల సభకు 41 మంది... పోటీ లేకుండానే ఎన్నిక

  • రాజ్యసభలో 57 ఖాళీలు
  • నిన్నటితో ముగిసిన నామినేషన్లు
  • వైసీపీ నుంచి నలుగురు
  • అత్యధికంగా బీజేపీ నుంచి 14 మంది ఏకగ్రీవం
  • మిగిలిన సీట్లకు ఈ నెల 10న ఎన్నికలు
దేశంలోని పలు ప్రాంతాల నుంచి రాజ్యసభకు 41 మంది ఏకగ్రీవమయ్యారు. అత్యధికంగా బీజేపీ నుంచి 14 మంది పెద్దల సభలో అడుగుపెట్టనున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు, ఏపీ అధికార పక్షం వైసీపీ నుంచి నలుగురు రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇతర ప్రాంతీయ పార్టీల నుంచి కూడా పలువురు రాజ్యసభలో ప్రవేశించనున్నారు.  

రాజ్యసభలో 57 ఖాళీలు ఏర్పడగా, జూన్ 10న ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. నామినేషన్లకు నిన్నటితో గడువు ముగిసింది. 41 మంది అభ్యర్థులు ఎలాంటి పోటీ లేకుండానే ఎన్నికల్లో ఏకగ్రీవమయ్యారు. ఇక మిగిలిన 16 స్థానాలకు ఎన్నికలు జరపనున్నారు. 

అత్యధికంగా మహారాష్ట్రలో 6 సీట్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. రాజస్థాన్ లో 4 సీట్లు, కర్ణాటకలో 4, హర్యానాలో 2 సీట్లకు ఎన్నికలు జరపనున్నారు. అటు, తాజా ఏకగ్రీవాలతో కలిపి రాజ్యసభలో వైసీపీ బలం 9కి పెరిగింది.


More Telugu News