వేడుకగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కుమార్తె రిసెప్షన్... వధూవరులకు కేటీఆర్ గ్రీటింగ్స్
- గత నెల 26న వైభవంగా వివాహ వేడుక
- శుక్రవారం రిసెప్షన్ ఏర్పాటు చేసిన శ్రీనివాస్ గౌడ్
- విందుకు హాజరైన కేటీఆర్
టీఆర్ఎస్ కీలక నేత, తెలంగాణ పర్యాటక, ఆబ్కారీ శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ కుమార్తె శ్రీహర్షిత వివాహం వంశీ కృష్ణతో గత నెల 26న వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహ వేడుకకు సంబంధించి మంత్రి శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం హైదరాబాదులోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించిన కేటీఆర్...ఇరు కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు.